Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సక్సెస్, ఫెయిల్యూర్‌కి నేను కూడా మినహాయింపు కాదు. నా 16 ఏండ్ల సినీ కెరీర్లో సక్సెస్, ఫెయిల్యూర్ కంటే పని చేయడాన్నే ఎక్కువ ఎంజారు చేశాను. అలాగే ప్రతి రోజుని కొత్తగా భావించాను. అయినప్పటికీ..ఇదే ఇన్నేండ్లు నేను సినీ రంగంలో ఉండటానికి కారణమైంది' అని నాయిక తమన్నా తెలిపింది. డిజిటల్ ఎంట్రీ ఇస్తూ నటించిన 'లెవెన్త్ అవర్', 'నవంబర్ స్టోరీస్' వెబ్‌సిరీస్‌లు రెండూ ఫెయిల్ అయ్యాయి. వీటి గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తమన్నా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. పనిలో కొత్తదనాన్ని చూస్తానే తప్ప జయాపజయాల్ని అస్సలు పట్టించుకోనని తెలిపింది. 'మాస్టర్ చెఫ్ ఇండియా' షోతో త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే 'సీటీమార్', 'మాస్ట్రో' చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.