Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. యాక్షన్‌తోపాటు ఎమోషన్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉన్న కథతో ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కించబోతున్నారు. కథకి తగ్గట్టుగా ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీని చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. దర్శకుడు బాబీ నెరేట్ చేసిన కథ, అందులోని తన పాత్ర బాగా నచ్చడంతో నవాజుద్దీన్ నటించడానికి గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఇది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు.