Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి 'సభకు నమస్కారం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం హీరో నరేష్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. సతీష్ మల్లంపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ కోనేరు నిర్మాత. అల్లరి నరేష్ నటిస్తున్న 58వ చిత్రమిది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయ నాయకుల శైలిని విమర్శించే తరహాలో పొలిటికల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఇలాంటి జోనర్లో నరేష్ సినిమా చేయడం ఇదే తొలిసారి. పదునైన సంభాషణలతో రైటర్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న రైటర్ అబ్బూరి రవి ఈ చిత్రానికి మాటలను అందిస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారాంతంలో షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం' అని చిత్ర యూనిట్ తెలిపింది.