Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కాంబినేషన్లో కె.వి.గుహన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' (హూ..వేర్..వై). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. బుధవారం హీరోయిన్ శివాని రాజశేఖర్ బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసి, శుభాకాంక్షలు తెలిపింది. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న శివాని స్పెషల్ పోస్టర్ అందరినీ అమితంగా అలరిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ,'ఈ మూవీలో చాలా ఛాలెంజింగ్‌గా ఉండే 'మిత్ర' పాత్రకి తన నటనతో శివాని పూర్తి న్యాయం చేశారు. గుహన్ స్టైలిష్ మేకింగ్, అదిత్, శివానిల అద్భుతమైన నటన డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి' అని అన్నారు.