Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్వతీశం, స్వాతి దీక్షిత్ జంటగా నటిస్తున్న చిత్రం 'గమ్మత్తు'. అశ్వని శ్రీ కృష్ణ దర్శకత్వంలో సూపర్‌స్టార్ స్టూడియోస్ పతాకంపై అంకిత శ్రీనివాస్‌రావు, బుయ్యాని మహేష్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. గురువారం ఈ చిత్ర లోగోను నిర్మాత బెక్కెం వేణుగోపాల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మంచి కథతో, మంచి టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి' అని అన్నారు. 'సరికొత్త కథతో మా సినిమా రూపొందింది. రాకెట్ రాఘవ, లిరీష వంటి తదితరులు నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. త్వరలోనే విడుదల చేస్తాం' అని మేకర్స్ తెలిపారు.