Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా నటిస్తున్న 68వ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం ఆరంభమైంది. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఎస్ఎల్వి సినిమాస్, ఆర్ టి టీమ్ వర్క్స్ పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది. రవితేజతోపాటు ఇతర తారాగణంపై హైదరాబాద్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఎనౌన్స్మెంట్ పోస్టర్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం వైపు చూస్తూ, రవితేజ కూర్చుని ఏదో టైప్ చేస్తున్నట్టు చూపించారు. పోస్టర్లోని కనిపిస్తున్న అగ్ని రవితేజ పాత్ర తీరుని చూపించే విధంగా ఉండటం విశేషం. ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన పాత లేఖ, డెస్క్, టైప్రైటర్, ఫైల్స్ తదితర అంశాల్ని గమనిస్తే ఓ శక్తివంతమైన కథతో ఈ సినిమా రూపొందబోతుందని వేరే చెప్పక్కర్లేదు. ఇందులో దివ్యాంశ కౌశిక కథానాయిక.