Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'అన్నాత్తే'. ప్రకాష్‌రాజ్, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, కీర్తిసురేష్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో రజనీ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ అభిమాన నటుడు రజనీ దీపావళి కానుకగా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపించారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.