Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజసజ్జ, శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'అద్భుతం'. మల్లిక్ రామ్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజనల్స్ బ్యానర్లు పై చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మిస్తున్నారు. గురువారం కథానాయిక శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. యువ కథానాయకుడు నాని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని తన సోషల్ మీడియా ఖాతాలు ద్వారా రిలీజ్ చేసి, చిత్ర బందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ మొగుళ్ళ మాట్లాడుతూ,'మా నాయిక శివాని రాజశేఖర్ బర్త్‌డే సందర్భంగా నాని విడుదల చేసిన మా చిత్ర ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించడం ఆనందంగా ఉంది. 'జాంబిరెడ్డి' సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో తేజసజ్జ ఈ సినిమాతో మరో వైవిధ్యమైన రోల్‌తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. రాజశేఖర్, జీవిత రాజశేఖర్ తనయ శివాని రాజశేఖర్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఆమె ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. మా చిత్ర టైటిల్ 'అద్భుతం'కి తగ్గట్లుగానే ఈ ఫస్ట్‌లుక్‌ని దర్శకుడు మల్లిక్ రామ్ వినూత్నంగా సిద్ధం చేశారు. అప్ అండ్ డౌన్ పద్ధతిలో డిజైన్ చేసిన ఫస్ట్‌లుక్‌కి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథ, మల్లిక్ రామ్ డైరెక్షన్ స్కిల్స్, తేజ సజ్జ యాక్షన్, శివాని రాజశేఖర్ పెర్ఫార్మెన్స్.. వెరసి 'అద్భుతం' చిత్రం ప్రేక్షకుల్ని అత్యద్భుతంగా ఆకట్టుకోవడం ఖాయం' అని చెప్పారు.
సత్య, మిర్చి కిరణ్, తులసి, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత - సజన్ యార్లభోలు, మ్యూజిక్ - రాదన్, డిఓపి - చింతా విద్యాసాగర్, ఎడిటర్ - గ్యారీ బీహెచ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - లక్ష్మీ భూపాల్, స్టోరీ - ప్రశాంత్ వర్మ, లిరిక్స్ - కష్ణ కాంత్.