Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు త్వరలో వెండితెరపై రాముడిగా మెరవ బోతున్నారా? అంటే, అవుననే సమాధానమే వినిపిస్తోంది. అల్లు అరవింద్, మధు మంతెన సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న చిత్రం 'రామాయణ'. మహాభారతంలో ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చిత్రాన్ని తెరకెక్కించ బోతున్నారు. ఇందులో రాముడిగా మహేష్ నటించబోతున్నారా అని బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు నిర్మాతల్లో ఒకరైన మధుమంతెన సమాధానమిస్తూ, ఆయనలాంటి స్టార్లు ఈ సినిమాలో చాలా మంది నటించబోతున్నారన్నారు. అలాగే రాబోయే దీపావళికి ఈచిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.