Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తే వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు ఈ తరం కథానాయికలు. హీరో సరసన సెకండ్ హీరోయిన్గా అయినా సరే నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలోకి తాజాగా రష్మిక మందన్నా కూడా చేరిందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియా మూవీ 'పుష్ప', బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా 'మిషన్ మజ్ను', బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్ బై' వంటి తదితర పెద్ద ప్రాజెక్టుల్లో రష్మిక నటిస్తోంది. ఇలాంటి టైమ్‌లో విజరు సరసన సెకండ్ హీరోయిన్గా గ్రీన్‌సిగల్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. విజరు ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో 'బీస్ట్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే ఓ నాయికగా నటిస్తోంది. మరో నాయికకి కూడా అవకాశం ఉండటంతో.. దీనికి సెకండ్ థాట్ లేకుండా రష్మిక పచ్చజెండా ఊపిందట.