Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇదిలా ఉంటే, చిన్న చిత్రాల విషయంలో ఈ తరహా మేలు చేసే నిర్ణయం తీసుకోకపోవడం గురించి తెలుగు చిత్ర పరిశ్రమపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక చిత్రాలను నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్‌కి గుర్తింపు ఉన్నప్పటికీ చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల విషయంలో అటు సినీ పెద్దలు, నిర్మాతల మండలితోపాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం పట్టించుకోకపోవడం బాధాకరమని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
కేరళ ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుందని, అలాంటి నిర్ణయం తీసుకుంటే టాలీవుడ్‌కి ఎంతో మేలు జరుగుతుందని రచయిత, నిర్మాత కోన వెంకట్ వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి విజ్ఞప్తి చేశారు.
'చిన్న సినిమాల కోసం కేరళ ప్రభుత్వం అవలంభించిన పద్ధతిని తెలుగు రాష్ట్రాలూ పాటిస్తే, తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా సహాయకారిగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లోనూ చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు. ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఒకవేళ తెరిచినా మునుపటిలా ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. పైగా పలువురు అగ్ర నిర్మాతల గుప్పెట్లో చాలా థియేటర్లు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో సొంత ఓటీటీ దిశగా తెలుగు చిత్ర పరిశ్రమ అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని కోన వెంకట్ తన ట్వీట్లో పేర్కొన్నారు.