Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ అగ్ర కథానాయిక విద్యాబాలన్ ఆస్కార్ ఆహ్వానాన్ని అందుకుని, అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆస్కార్ విజేతలను ఎంపిక చేసే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో ఒకరిగా విద్యాబాలన్ ఉండ బోతున్నారు. 'క్లాస్ ఆఫ్ 2021' అంటూ ఆస్కార్ కమిటీ 395 మంది సభ్యుల్లో విద్యాబాలన్‌తోపాటు నిర్మాతలు ఏక్తాకపూర్, శోభాకపూర్ పేర్లను ప్రకటించటం విశేషం.
ఎపీ ముఖ్యమంతి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో 'యాత్ర 2' సినిమాని దర్శకుడు మహి.వి.రాఘవ తెరకెక్కించబోతున్నారు. ఇందులో జగన్‌గా 'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీ నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒక ఇన్‌స్టా పోస్ట్ పెడితే అక్షరాల 3 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తారని హాపర్ హెచ్‌క్యూ 2021 అనే సంస్థ 'ఇన్స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్' పేరుతో విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కి అధిక మొత్తం వసూలు చేసే నాయికగా దేశవ్యాప్తంగా ప్రియాంక ఒక్కరే కావడం విశేషమని తెలిపింది.