Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'డాక్టర్ సాబ్'. డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్.పి నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రమిది. డాక్టర్లు ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ విక్కీ సమర్పకుడు.
ఈ చిత్ర టైటిల్ లోగోని నిర్మాత సురేష్ కొండేటి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'కరోనా సమయంలో డాక్టర్లు చేసిన సేవలు మరువలేం. వారు నిజమైన దేవుళ్ళు. అలాంటి డాక్టర్స్‌లో ఒకరు శోభన్. అయన హీరోగా నటిస్తూ, నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించడం, చిరకాల మిత్రుడు విక్కీ మాస్టర్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం' అని తెలిపారు. 'నా శిష్యులు శోభన్, సురేష్ ఈ చిత్రానికి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ వర్క్ చేశారు. డాక్టర్ దేవుడని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుంది' అని విక్కీ మాస్టర్ అన్నారు. దర్శకుడు డి.ఎస్.బి మాట్లాడుతూ,'నన్ను నమ్మి ఈ సినిమాని తెరకెక్కించిన నిర్మాత, హీరో శోభన్‌కి కతజ్ఞతలు. మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీస్తున్నాం' అని చెప్పారు. హీరో, నిర్మాత శోభన్ మాట్లాడుతూ,'కథ వినగానే హీరోగా చేయాలనిపించింది. మరో కారణం విక్కీ మాస్టర్. అయన మొదట్నుంచి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. దర్శకుడు సురేష్ సహకారం బాగా ఉంది. సినిమా బాగా చేశారు' అని తెలిపారు.