Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'ఎఫ్3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఈ సినిమా చిత్రీకరణను శుక్రవారం పున: ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, '2019లో సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'ఎఫ్2'. ఈ సినిమాకు ఫ్రాంచైజీగా 'ఎఫ్ 3' సినిమాని అదే టీమ్‌తో నిర్మిస్తున్నాం. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా చిత్రీకరణను రీస్టార్ట్ చేశాం. హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభమైంది. సెట్స్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలతో చిత్రీకరణ చేస్తున్నాం. వెంకటేష్ వరుణ్‌తేజ్, సునీల్ సహా ముఖ్యతారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రాన్ని తనదైన స్టయిల్లో 'ఎఫ్2'కి మించి ఎంటర్టైన్మెంట్తో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. మా బ్యానర్లో మరో నవ్వుల రైడ్ కన్ఫర్మ్' అని చెప్పారు.
''ఎఫ్ 2'కు ఫ్రాంచైజీగా మరింత వినోదంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వెంకటేష్, వరుణ్‌తేజ్, నిర్మాతలు రాజుగారు, శిరీష్ సపోర్ట్‌తో వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేస్తాం' అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: దిల్‌రాజు, నిర్మాత: శిరీష్, సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కష్ణ, ఆడిషన్ స్క్రీన్‌ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్, రచన, దర్శకత్వం: అనీల్ రావిపూడి.