Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమా నిర్మాణ పరంగా నిర్మాతగా కొంచెం టెన్షన్ పడుతున్నా. అయితే నటిగా ఎప్పటిలాగే నా వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా' అని బాలీవుడ్ కథానాయిక అలియాభట్ అన్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను, నూతన ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అలియా 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్‌పై నిర్మాతగా తొలిసారి 'డార్లింగ్స్' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శనివారం ఆరంభమైంది. ఈ సందర్బంగా నిర్మాతగా తాను ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి అలియా తెలిపింది. ఓ వైవిధ్యమైన కథ, కథనంతో 'డార్లింగ్స్' సినిమా ఉంటుందని, ఇందులో రాజ్‌కుమార్‌రావు పాత్ర వినూత్నంగా ఉంటుందని తెలిపింది. అలియా ఇందులో నటిస్తూ, నిర్మించడం విశేషం. 'ఆర్ఆర్ఆర్', 'బ్రహ్మాస్త్ర', 'గంగూబాయి కతియావాడి' వంటి చిత్రాల్లోనూ అలియా నటిస్తోంది.