Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్తగిరి, నేహా సోలంకి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'గూడుపుఠాణి'. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కుమార్ కె.ఎం దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని నటశేఖర కృష్ణ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ,'సూపర్ స్టార్ కష్ణ నటించిన 'గూడుపుఠాణి' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అదే టైటిల్‌తో నేను ఈ సినిమా చేయటం ఓ విశేషమైతే, సూపర్ స్టార్ కష్ణగారు మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయటం మరో విశేషం. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు' అని తెలిపారు. 'మా సినిమా చాలా బాగా వచ్చింది. సప్తగిరి నటన, దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్ మంగుళూర్ పరిసర అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. సూపర్ స్టార్ కష్ణ గారు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది' అని నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ చెప్పారు. దర్శకుడు కుమార్ కె. ఎం మాట్లాడుతూ,'డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది' అని అన్నారు.ఈ చిత్రానికి కెమెరా: పవన్ చెన్న, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మ్యూజిక్: ప్రతాప్ విద్య, ఫైట్స్: సోలిన్ మల్లేష్.