Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత నట్టి కుమార్ తనయ నట్టి కరుణ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తున్న చిత్రం 'డిఎస్‌జె' ( దెయ్యంతో సహజీవనం). అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిన్మయి పాడిన 'మేఘాలలో హరివిల్లులా' అంటూ సాగే పాటను ఆదివారం మ్యాంగో మ్యూజిక్ ద్వారా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ,'కాశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో 5 రోజులు పాటు 'మేఘాలలో హరివిల్లులా' పాటను చిత్రీకరించాం. ఈ పాటను చిన్మయి అత్యద్భుతంగా పాడారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేసిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. ఈనెల 16న ఒకేసారి 5 భాషల్లో మా చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. చదువులో గోల్డ్ మెడల్ సాధించిన ఓ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు?, ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివేంజ్ తీర్చుకుంది అనేదే కథ. మహిళా ప్రధానంగా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు. 'గతంలో కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా వచ్చి, మంచి విజయం సాధించాయి. అలాగే మా సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్, కోటి తనయుడు రాజీవ్‌ల నటన అందర్నీ మెప్పిస్తుంది' అని చిత్ర నిర్మాత నట్టి క్రాంతి చెప్పారు.