Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపిక ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'అశ్మీ'. సాచీ క్రియేషన్స్ పతాకంపై స్నేహా రాకేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు శేష్ కార్తీకేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వినూత్నమైన థ్లిలర్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతోంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత స్నేహా రాకేష్ మాట్లాడుతూ, ''అశ్మీ' అనే టైటిల్ పెట్టడంతో అటు ఇండిస్టీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. దీంతో ఇటీవల విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆడియెన్స్‌కి సీట్ ఎడ్జ్‌లో కూర్చుని చూసే అనూభూతినిచ్చేలా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠ భరితంగా దర్శకుడు రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, మా సినిమా విడుదలకి సిద్ధం ఉంది' అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, మ్యూజిక్ - శాండీ అద్దంకి, రచన - సినిమాటోగ్రఫి - దర్శకత్వం : శేష్ కార్తీకేయ.