Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రావంత్, సలోని జంటగా రూపొందుతున్న చిత్రం 'రాజుకు నచ్చిందే రంభ'. శ్రీనివాసరావు ర్యాలి దర్శకుడు. దేేవరపల్లి అఖిల్, వల్లాల ప్రవీణ్‌కుమార్ యాదవ్ (వెంకట్) నిర్మాతలు. వి.చిన్న శ్రీశైలం యాదవ్ సమర్పణలో దేవరపల్లి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ర్యాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక హీరోయిన్గా సలోని నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా నటించనుంది. రెగ్యులర్ చిత్రీకరణని త్వరలోనే ప్రారంభిస్తాం. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి చాలా మంచి పాటలు ఇచ్చారు. సంగీత దర్శకుడు రఘు కుంచె అంతే అద్భుతంగా ఈ పాటలను కంపోజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు' అని తెలిపారు.
'ఈ సినిమా నాకొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. నాకు స్టార్ లిరిక్ రైటర్స్‌ని ఇచ్చారు. నా మార్క్ మిస్ కాకుండా, అద్భుతమైన బాణీలతో చిత్ర విజయంలో భాగమవుతాను' అని సంగీత దర్శకుడు రఘు కుంచె అన్నారు. అజరు ఘోష్, రఘు కుంచె, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కష్ణ మోహన్ రావు, లక్ష్మీ నారాయణ చౌదరి, శ్రీనివాసరావు కాంతి, లైన్ ప్రొడ్యూసర్: కావిడి ఆనంద్, కొరియోగ్రాఫర్: తార, కెమెరా: జవహార్ రెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు, సహ-నిర్మాతలు: వల్లాల రమేష్ యాదవ్, ఎ. రాజు సాగర్, కోన సత్యనారాయణ చౌదరి, స్టోరీ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ర్యాలి శ్రీనివాసరావు.