Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్సిక తెలుగులో నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం 'మై నేమ్ ఈజ్ శతి'. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో జరిగిన పూజతో ఈ సినిమా లాంఛనంగా ఆరంభమైంది. ముహూర్తపు షాట్‌కి రేవతి క్లాప్‌నివ్వగా, వైష్ణవి కెమెరా స్విచాన్ చేేశారు. తొలి షాట్‌కు వంశీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హన్సిక మాట్లాడుతూ, 'కథానాయికగా ఇది నా 52వ చిత్రం. స్వతంత్ర భావాలు ఉన్న శతి అనే యువతిగా ఈ సినిమాలో కనిపిస్తా. నా భావాల్ని ధైర్యంగా ప్రకటించే యువతిగా నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఆద్యంతం ఊహకందని మలుపులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది' అని తెలిపారు. 'నటన పరంగా లీడ్‌రోల్ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కథ విన్న తర్వాత ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా మంది భయపడ్డారు. కానీ హన్సిక ధైర్యంగా అంగీకరించింది' అని నిర్మాతలు అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ,'ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు ఉంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొంది? అనేదే ఈ చిత్ర ఇతివత్తం. సోమవారం నుంచి తొలి షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తాం. ఈ నెలాఖరున సెకండ్ షెడ్యూల్, ఆగస్ట్‌లో మూడో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం' అని చెప్పారు.