Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నదీయాస్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై ప్రొడక్షన్ నెం.1గా 'శంభో శంకరా' ఫేమ్ శ్రీధర్.ఎన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎ.ఎమ్. ఫెరోజ్ నిర్మాత. అంగరంగ వైభవంగా జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆంధ్రపద్రేశ్ శాసన సభ్యురాలు, ఏపిఐఐసి ఛైర్మెన్, అగ్ర నాయిక రోజా సెల్వమణి ముఖ్య అతిధిగా విచ్చేసి, చిత్ర యూనిట్‌కి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత ఫెరోజ్ మాట్లాడుతూ, 'ఓ క్రేజీ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. షకలక శంకర్‌తో 'శంభో శంకరా' వంటి కమర్షియల్ విజయాన్ని సాధించి, అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పుని దర్శకుడు శ్రీధర్ పొందారు. ఇప్పుడు తెరకెక్కించబోయే ఈ సినిమా కథను సైతం వినూత్నంగా ప్రజెంట్ చేయబోతున్నారు. తొలి సినిమాతోనే మా బ్యానర్‌కి ఆయన మంచి సక్సెస్ అందిస్తారనే నమ్మకం ఉంది. మా చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన రోజాగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని చెప్పారు. ఈ చిత్రానికి మ్యూజిక్ - మణిశర్మ, సినిమాటోగ్రఫి - శ్రీసాయి, ఎడిటిర్ - ఛోటా కె. ప్రసాద్, డైలాగ్స్ - హర్ష వర్ధన్.