Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌర్యాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'త్రైతం'. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై రవికుమార్.ఎస్‌ని దర్శకుడిని పరిచయం చేస్తూ పసుపులేటి వెంకటరమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నిఖిల్ క్లాప్ నివ్వగా, చందు మొండేటి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,'హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపే రెండు షెడ్యూల్స్‌తో చిత్రీకరణ పూర్తి చేస్తాం. 'త్రైతం' అనేది భగవద్గీతలో ఒక సిద్ధాంతం. దీని ప్రకారం మనిషి, దేవుడితో పాటు ఆత్మ కూడా ఉంది. అయితే వీటికి మా సినిమాకి సంబంధం ఏంటనేది వెండితెరపై చూపించబోతున్నాం' అని తెలిపారు.
''వన్ బై టెన్', 'జరగని కథ' వంటి సినిమాల తర్వాత మా బ్యానర్లో చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలోని పాత్రకు మౌర్యాని చక్కగా సెట్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని నిర్మాత చెప్పారు. హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ,'దర్శకుడు రవి చెప్పిన కథ చాలా బాగుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించటం అదష్టంగా భావిస్తున్నా' అని తెలిపింది.