Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆదిపురుష్' వంటి పాన్ ఇండియా చిత్రంతో స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. వీరి బాటలోనే మరో హీరో వరుణ్‌తేజ్ సైతం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. వరుణ్‌తేజ్ హీరోగా ఓ నూతన దర్శకుడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ సినిమాలో వరుణ్ సరసన కైరా అద్వానీ నటించనుందట. వరుణ్‌తేజ్ ప్రస్తుతం 'ఎఫ్3', 'గని' చిత్రాల్లో నటిస్తున్నారు.