Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు కష్ణ, సంజనా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం 'అలర్ట్'. ఈ చిత్రంతో మూర్తి కొడిగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యుఎ క్రియేషన్స్ పతాకంపై మల్లిఖార్జున్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈచిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, వి.సముద్ర ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో విజరు కష్ణ మాట్లాడుతూ, 'హీరోగా ఇది నాలుగో సినిమా. ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి?, యువత ఎలా మోసపోతున్నారు అనే అంశాలతో ఉన్న ఈ కథ బాగా నచ్చింది' అని చెప్పారు.
'నా స్నేహితుడి స్నేహితుడికి ఎదురైన ఘటనతో ఈ సినిమా చేస్తున్నాం. అతని జీవితంలో జరిగింది విన్నప్పుడు కన్నీళ్ళొచ్చాయి. అందుకే దీన్ని షార్ట్ ఫిల్మ్‌గా అనుకున్నప్పటికీ సినిమాగా చేయాలని ఫిక్స్ అయ్యాం' అని నిర్మాత అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, 'హీరోతో పాటు మరో ముఖ్యమైన పాత్రలో నిర్మాత కూడా నటిస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం.సినిమా మొత్తం కాకినాడలో చేస్తాం' అని చెప్పారు.
విజరు కష్ణ, మల్లిఖార్జున్ ఉప్పలపాటి, సంజన చౌదరి, దుర్గారావు, ఆనంద్ భారతి, బైలాంపుడి బ్రహ్మానందరెడ్డి, త్రిమూర్తులు, రామరాజ్ నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్: మణి కోరే, ఎడిటర్: శివ, కొరియోగ్రాఫర్: ఉమా శంకర్, కెమెరా: మనోహర్ కొల్లి.