Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లోనూ థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల మూతపడిన థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 50 శాతం ఆక్యూపెన్సీతో ఈనెల 8 నుంచి థియేటర్లను రన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో రెండు వారాల క్రితమే థియేటర్ల ఓపెనింగ్‌కి అనుమతి ఇచ్చారు. ఇక్కడ కూడా 50 శాతం ఆక్యూపెన్సీతోనే థియేటర్లను రన్ చేయాలని తెలంగాణ సర్కార్ తెలిపింది. అయితే ఏపీలో థియేటర్లకి అనుమతి ఇవ్వకపోవడంతో నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేయలేకపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి థియేటర్లు ఓపెన్ అయితేనే ఏ నిర్మాతకైనా ఉపయుక్తంగా ఉంటుంది. తాజాగా ఏపీ సర్కార్ సైతం గ్రీన్‌సిగల్ ఇవ్వడంతో ఇప్పుడు మేకర్స్ అందరూ తమ సినిమాల విడుదలపై కసరత్తులు చేయటం స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, రెండు వారాలైనప్పటికీ తెలంగాణలో థియేటర్లు ఎందుకు ప్రారంభం కాలేదనే విషయమై సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో సోమవారం ఓ సమావేశం జరిగింది. ఇంకా థియేటర్లను ఎందుకు ఆరంభించలేదని సీఎస్ అడిగిన ప్రశ్నకు నిర్మాతలు డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, కె.ఎల్. దామోదర్‌ప్రసాద్, తెలుగు, తెలంగాణ ఛాంబర్ సభ్యులు ప్రస్తుత పరిస్థితుల దష్ట్యా ఉన్న సమస్యలను వివరించారు. అలాగే 2018లో తెలంగాణ ప్రభుత్వం ఉచిత పార్కింగ్ నిర్ణయం తీసుకుందని, తిరిగి పార్కింగ్ ఛార్జీలకు అనుమతి ఇస్తే, ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడే అవకాశం ఉంటుందని, పార్కింగ్ నుంచి థియేటర్లకు 40 శాతం రాబడి ఉంటుందని సీఎస్‌కు నిర్మాతలు విన్నవించారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ముడిపడి ఉన్న అంశం కావడంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎస్ తెలిపారు.