Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాతోపాటు కొరటాల శివ, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్న విషయం విదితమే. వీటి తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయటానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. ఇటీవల అట్లీ నెరేట్ చేసిన ఓ ప్రేమకథ ఎన్టీఆర్‌కి బాగా నచ్చిందని సమాచారం. ఇప్పటివరకు యాక్షన్ బేస్డ్ కమర్షియల్ సినిమాలు చేసిన ఎన్టీఆర్ అచ్చమైన ప్రేమకథల్లో నటించలేదు. అందుకే అట్లీ చెప్పిన లవ్‌స్టోరీకి ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యారట. దీంతో త్వరలోనే ఓ ప్రేమికుడిగా ఎన్టీఆర్ వెండితెరపై మెరవబోతున్నారని వేరే చెప్పక్కర్లేదు. అట్లీ ప్రస్తుతం షారూఖ్‌ఖాన్‌తో ఓ బాలీవుడ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.