Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూసధోరణి గ్లామర్ పాత్రలకు కథానాయికలు ఎప్పుడో చెక్ పెట్టారు. కథ, పాత్ర నచ్చితే తమలోని నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి ఏ మాత్రం వెనకాడ్డం లేదు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నాయికలు భిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించి, తమకంటూ ఓ స్టార్ స్టేటస్‌ని, అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. వీరి మాదిరిగానే మరో ఇద్దరు హీరోయిన్లు కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో 'రా' ఏజెంట్‌గా కాజల్ కనిపించనుందని సమాచారం. అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులతో సన్నిహితంగా ఉంటూ, వాళ్ల సమాచారాన్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించే పాత్రలో కాజల్ నటించనుందట. కాజల్ ప్రస్తుతం చిరంజీవి సరసన 'ఆచార్య'తోపాటు 'గోస్టీ', 'ఇండియన్ 2', 'ఉమ' వంటి తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే, తేజస్ దోస్కర్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో కండోమ్ టెస్టర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. బోల్డ్‌గా ఉండే ఈ పాత్రని సారా అలీఖాన్, అనన్య పాండేలు తిరస్కరించారు.రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాతోపాటు 'అయలాన్', 'ఎటాక్', 'అక్టోబర్ 31.. లేడీస్ నైట్', 'మే డే', 'థ్యాంక్యూ గాడ్', 'ఇండియన్ 2' వంటి తదితర తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.