Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బి.కె.ప్రొడక్షన్ పతాకంపై శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దమ్మున్నోడు'. (దుమ్ము దులుపుతాడు అనేది ట్యాగ్ లైన్). ప్రియాంశ్, గీతాంజలి, స్వప్న కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ కొండేకర్, రేణుక కొండేకర్ నిర్మాతలు. ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లోని రాక్ కాజిల్ హౌటల్లో ఘనంగా పారంభమైంది. హీరో, హీరోయిన్లు శివ, ప్రియాంశ్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు నిర్మాతలు ప్రసన్న కుమార్ క్లాప్ నివ్వగా, టి. రామ సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా పాత్రికేయులతో హీరో, దర్శకుడు శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ, 'పవర్ఫుల్ కథ, మాస్ ఎలిమెంట్స్, భారీ ఫైట్స్, సాంగ్స్‌తో ఈ సినిమా ఉంటుంది. ఫైట్‌తో చిత్రీకరణ ప్రారంభించాం. ఇప్పటి వరకు ఫైట్స్ పరంగా నాకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో డాన్స్ పరంగా కూడా మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉంది. ఇందులోని నాలుగు పాటలు అద్భుతంగా కుదిరాయి. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం' అని చెప్పారు. 'సొలో ప్రొడ్యూసర్‌గా నాకిది తొలి సినిమా. గతంలో 'సూపర్ పవర్' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించా. దమ్మున్నోడు కథ, టైటిల్ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. ఏడు భారీ ఫైట్స్, నాలుగు అద్భుతమైన పాటలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తాను' అని నిర్మాత బాలాజీ కొండేకర్ అన్నారు.