Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అలరించిన 'సూపర్మ్యాన్' సిరీస్ చిత్రాల దర్శకుడు రిచర్డ్ డోనర్ (91) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు.
1930లో న్యూయార్క్లో పుట్టిన రిచర్డ్ యాక్టర్ కావాలని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే అనుకోకుండా దర్శకుడిగా మారారు. అలాగే నిర్మాతగానూ హాలీవుడ్లో తనదైన మార్క్ వేశారు. కామిక్ పుస్తక రచయితగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఎక్స్-15' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్న రిచర్డ్ 'సాల్ట్ అండ్ పెప్పర్', 'లోలా', 'ద ఒమన్' వంటి చిత్రాలను రూపొందించారు. అయితే 1978లో తెరకెక్కించిన 'సూపర్మ్యాన్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొంది, ఆయన దర్శక ప్రస్థానాన్ని మార్చేసింది. 'సూపర్మ్యాన్'కి కొనసాగింపుగా 'సూపర్మ్యాన్ 2' వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత 4 భాగాలతో వచ్చిన 'లెథల్ వెపన్' సిరీస్తోనూ విశ్వ ప్రేక్షకుల్ని మెప్పించి, దర్శక దిగ్గజంగా హాలీవుడ్లో చరిత్ర సృష్టించారు.
దర్శకుడిగా, నిర్మాతగా అటు వెండితెర, బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన రిచర్డ్ 'యాక్షన్ కామిక్స్', 'లాస్ట్ సన్', 'ఎస్కేప్ ఫ్రమ్ బిజారో వరల్డ్' వంటి తదితర పుస్తక రచనలతో రచయితగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. రిచర్డ్ జీవితాన్ని అక్షరబద్ధం చేస్తూ 2010లో 'యు ఆర్ ది డైరెక్టర్ .. యు ఫిగర్ ఇట్ అవుట్: ది లైఫ్ అండ్ ఫిల్మ్స్ ఆఫ్ రిచర్డ్ డోనర్ పేరుతో ఓ పుస్తకాన్ని జేమ్స్ క్రిస్టీ రాశారు.