Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ పక్క కమర్షియల్ సినిమాలు, మరో పక్క మహిళా ప్రధాన చిత్రాలు అన్నింటికిమించి ప్రతిభను నిరూపించుకునే పాత్రలతో నాయిక అలియాభట్ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో పాటు బాలీవుడ్లో 'బ్రహ్మాస్త్ర', 'గంగుబాయి కతియావాడి' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే 'డార్లింగ్స్' చిత్రాన్ని నిర్మిస్తూనే కథానాయికగానూ మెరవబోతోంది. ఇక లేటెస్ట్గా కరణ్‌జోహార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని' చిత్రానికి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. 'గల్లీభారు' తర్వాత రణ్వీర్ సింగ్, అలియా జోడీ ఈ సినిమాతో మరోమారు సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయటానికి రెడీ అవుతున్నారు. ప్రేమ, కుటుంబం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2022లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు యశ్ జోహార్, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా సన్నాహాలు చేస్తున్నారు.