Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఇందువదన'. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.ఆర్. దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన 'వడి వడిగా..' తొలి పాటకు విశేష ఆదరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ మాట్లాడుతూ, 'ఇటీవల రిలీజైన మా చిత్ర ఫస్ట్‌లుక్ చాలా కళాత్మకంగా ఉందనే ప్రశంసలతోపాటు అనూహ్య స్పందన రాబట్టుకుంది. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్‌ని కథాపరంగా దర్శకుడు ఎం.ఎస్.ఆర్. ఎంతో అద్భుతంగా డిజైన్ చేయడం బాగా ప్లస్ అయ్యింది. లేటెస్ట్గా విడుదలైన 'వడి వడిగా..' రొమాంటిక్ మెలోడీ సాంగ్‌లో వరుణ్, ఫర్నాజ్ మధ్య కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. సారథి స్టూడియోస్‌లో వేసిన భారీసెట్స్‌లో క్లైమాక్స్ చేయడంతో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇన్ఫీనిటమ్ మ్యూజిక్, బిలీవ్ మ్యూజిక్ ద్వారా మా ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోంది' అని చెప్పారు.