Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రెండు భాగాలుగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే మంగళవారం ఈ సినిమా షూటింగ్‌ని పునః ప్రారంభించారు. ఇందులో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్నా నాయికగా నటిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. 'ఆర్య', 'ఆర్య-2' తర్వాత సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.