Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామినీ కౌశల్, మధుబాల, వైజయంతీమాల వంటి తదితర కథానాయికలతో దిలీప్సాబ్ ప్రేమాయణం నడిపినప్పటికీ ఏ బంధమూ పెళ్ళి పీటల వరకు రాలేదు. అయితే 12 ఏళ్ల వయసులోనే సైరాభాను దిలీప్కుమార్తో ప్రేమలో పడ్డారు. 1966లో 44 ఏండ్ల వయసు ఉన్న దిలీప్ని సైరా పెళ్లి చేసుకున్నారు. అప్పటికీ సైరా వయసు కేవలం 22 ఏండ్లు మాత్రమే. దశాబ్దకాలం పాటు సైరా కూడా తిరుగులేని నాయికగా బాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ 'గోపీ', 'జిందగీ', 'బైరాగ్' వంటి తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అయితే వీరికి సంతానం లేకపోవడంతో ఆస్మాను 1980లో దిలీప్ పెళ్ళి చేసుకున్నారు. వీరి బంధం ఎక్కువ కాలం నిలవకపోవడంతో మళ్ళీ సైరా దగ్గరికి వచ్చిన దిలీప్ కడవరకు ఆమెతోనే ఉన్నారు.