Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్ మరణవార్తతో సినీ చరిత్రలో ఓ శకం ముగిసినట్లయ్యిందని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి దిలీప్‌కుమార్. తన నటనతో విదేశాల్లో సైతం ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. భారతీయుల హదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారు.
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సినీ పరిశ్రమలో లెజెండ్‌గా దిలీప్‌కుమార్ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారు. ఆయనలోని నటనాకౌశలం, తేజస్సు ఎన్నో సంవత్సరాలపాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆయన మరణం సినీ లోకానికి, సాంస్కతిక ప్రపంచానికి తీరని లోటు.
- ప్రధాని నరేంద్రమోదీ
ఓ సినీ బాంఢాగారం చరిత్ర పుటలోకి వెళ్లిపోయింది. ఇకపై ఎప్పుడైనా భారతీయ సినిమా గురించి చెప్పాలంటే దిలీప్‌కుమార్‌కి ముందు.. తర్వాత అని అభివర్ణించాలి. - అమితాబ్ బచ్చన్
భారతీయ సినీ పరిశ్రమలో ఉత్తమ నటుడు దిలీప్‌కుమార్
- సల్మాన్‌ఖాన్
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దిలీప్‌కుమార్ మతితో సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. ఆయన ఒక సినీ సంస్థ, సినీ సంపద. కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్ మతి బాధకరం.
- చిరంజీవి
మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలు, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను. మీరే నా అభిమాన నటుడు. మీలాగా ఎవరూ ఉండలేరు. ఉండరు.
- మమ్ముట్టి
లెజెండ్ నటుడు దిలీప్‌కుమార్ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. ప్రపంచంలో ఎంతోమంది నటనపరంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. సినిమా పరిశ్రమకు ఇదో తీరని లోటు.
- మహేష్‌బాబు
భారతీయ సినీ పరిశ్రమ విలువను పెంచిన దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవి.
- ఎన్టీఆర్