Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ నటుడు అక్షరుఖన్నా నటించిన 'జీ 5' ఒరిజినల్ మూవీ 'స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్'. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని 'జీ 5' ఓటీటీ వేదికగా నేడు (శుక్రవారం) హిందీ, తమిళం, తెలుగులో ఏకకాలంలో ప్రదర్శించనున్నారు.
'ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షరు ఖన్నా చాలా సంవత్సరాల తర్వాత నటించటం విశేషం. 'స్టేట్ ఆఫ్ సీజ్: 26/11'లో ఎన్ఎస్జీ కమాండోగా నటించిన వివేక్ దహియాను ఈ ఒరిజినల్ మూవీలోనూ చూడవచ్చు. వీరితో పాటు గౌతమ్ రోడె, సమీర్ సోని, పర్వీన్ దబాస్, మంజరి ఫడ్నవీస్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం.
'స్టేట్ ఆఫ్ సీజ్:26/11' రూపొందించిన కాంటిలో పిక్చర్స్ (అభిమన్యు సింగ్) ఈ చిత్రానికి నిర్మాత. 'అభరు 2'కు దర్శకత్వం వహించిన కెన్ ఘోష్ దీనికి దర్శకుడు. కర్నల్ (రిటైర్డ్) సందీప్ సేన్ (26/11 భయానక ముంబయి దాడుల సమయంలో ఎన్‌ఎస్‌జీకికి సెకండ్ ఇన్ కమాండ్) ఈ స్టేట్ ఆఫ్ సీజ్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించిన 'స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్' మన భారత సైనికులకు నివాళి. భారతీయుల ధైర్యానికి వందనం ఇది. థ్రిల్, యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ఉన్న ఈ చిత్రం వీక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంది' అని జీ5 ఓటీటీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.