Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.6గా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న తొలి బైలింగ్వల్ సినిమా ఇది. 'రన్', 'ఆవారా', 'పందెంకోడి' వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు లింగుసామి చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన 'ఉప్పెన' ఫేమ్ కతీ శెట్టి హీరోయిన్గా నటించనున్నారు. ఈ నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, 'చాలా కాలంగా రామ్‌తో సినిమా చేయాలని మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం. లింగుసామి చెప్పిన పవర్ఫుల్ ఊర మాస్ సబ్జెక్ట్ మా అందరికీ నచ్చి, రామ్‌కి వినిపించాం. కథ వినగాన,ే ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. వెంటనే సినిమా చేద్దామన్నారు. రీసెంట్గా లింగుసామి చేసిన ఫైనల్ నేరేషన్‌కి హీరో మరింత ఎగ్జైట్ అయ్యారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ లవ్ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేశారు. మిగతా సాంగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్, యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బు-అరివు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి, సాయిమాధవ్ బుర్రా వంటి టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. మా బ్యానర్లో భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం' అని తెలిపారు.
రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయనణ, యాక్షన్: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుసామి.