Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న పూజా హెగ్డే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగల్ ఇచ్చిందని సమాచారం. తమిళ స్టార్ ధనుష్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్త ఇప్పటికే బాగా హల్చల్ చేస్తోంది. విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ ద్విభాషా చిత్రంలో ధనుష్ సరసన పూజా మెరవనుందట. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని భారీగా నిర్మించనుందని వినిపిస్తోంది. పూజా ఇప్పటికే ప్రభాస్‌తో 'రాధేశ్యామ్', అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', రామ్‌చరణ్‌కి జోడీగా 'ఆచార్య' చిత్రాల్లో నటిస్తోంది. లేటెస్ట్గా విజరు 'బీస్ట్' చిత్రానికీ పచ్చజెండా ఊపింది. అలాగే మహేష్ బాబు-త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమాల్లోనూ నటించనుంది. వీటితోపాటు బాలీవుడ్లో 'సర్కస్', 'భారుజాన్' వంటి భారీ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటున్న పూజా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల్ని పారితోషికంగా తీసుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.