Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన తారలు విజరు రాజ్, నేహా పతన్, అమితా రంగనాథ్ నటిస్తున్న చిత్రం 'ఏం చేస్తున్నావు'. ఎన్వీఆర్ క్రియేటివ్ వర్క్స్ పతాకం పై నూతన దర్శకుడు భరత్ మిత్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీమతి కురువా లక్ష్మీ సమర్పణ. నవీన్ కురువా, కిరణ్ కురువా నిర్మాతలు. ఈ చిత్ర టైటిల్ ఎనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ని మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో రెడీ అవుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన శైలి మ్యూజిక్‌తో విడుదలైన ఈ చిత్ర టైటిల్ ఎనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోందని మేకర్స్ చెప్పారు.