Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్‌తరుణ్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్న చిత్రం 'స్టాండప్ రాహుల్'. సాంటో మోహన్ వీరంకి దర్శకుడు. వర్షా బొల్లమ్మ కథానాయిక. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నందకుమార్ అభినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథానాయకుడు రానా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.