Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'హిట్'. నాని నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై విశేష ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాన్యా మల్హోత్రాని నాయికగా ఎంపిక చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టీ- సిరీస్ భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్, కుల్దీప్ రాథోర్‌తో కలిసి దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు 'హిట్' చిత్రానికి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది.