Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సముద్రఖని, వినరు వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ కీలక పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'ఆకాశవాణి'. అశ్విన్ గంగరాజు దర్శకుడు. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్ 'దిమ్ సారె..' అనే లిరికల్ పాటను విడుదల చేసింది. ఓ గూడెంలోని ప్రజలందరూ చాలా బాధగా ఉంటారు. అలాంటి సందర్భంలో అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా జాతర జరుపుకోవాలనుకునే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కాల భైరవ సంగీతంతో వచ్చిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం తెలిపింది.