Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని భాషలకు చెందిన సినిమాల పేర్ల నమోదు, పబ్లిసిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్‌తోపాటు ఇకపై కథల రిజిస్ట్రేషన్‌ని కూడా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోనే చేసుకోవచ్చని అసోసియేషన్ కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు కథల రిజిస్ట్రేషన్ రచయిత సంఘం ద్వారా జరుగుతున్న విషయం విదితమే. నిర్మాతల మండలిలో సభ్యత్వం ఉన్న వారితోపాటు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దీనికి అనుబంధంగా ఉన్న అసోసియేన్లతో సభ్యత్వం ఉన్న ఎవరైనా పైన పేర్కొన్న సేవలను వినియోగించుకోవచ్చని, ఇప్పటికే 30 కథలు, 13 సినిమా టైటిల్స్‌ని పలువురు రిజిస్టర్ చేసుకున్నారని, వీటితోపాటు తక్కువ రేటుతోనే సినిమాలకు సంబంధించిన పబ్లిసిటీని కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చని వారన్నారు.