Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ హీరో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటిస్తున్న 'లాల్‌సింగ్ చద్దా' సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని లడఖ్‌లో చిత్రీకరణ జరుగుతున్న లొకేషన్లో దిగిన ఓ ఫొటోతో, సోషల్ మీడియా వేదికగా శుక్రవారం నాగ చైతన్య తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. కిరణ్‌రావు, చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్‌తో ఆర్మీ గెటప్‌లో ఉన్న అమీర్, చైతూల ఈ ఫొటో వైరల్ అయ్యింది. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్, ఆస్కార్ విన్నర్ 'ఫారెస్ట్‌గంప్' చిత్రానికి రీమేక్‌గా 'లాల్‌సింగ్ చద్దా' తెరకెక్కుతోంది