Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారీ తారాగణంతో తొమ్మిది మంది దర్శకులు తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'నవరస'. సూర్య, సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్, విజరు సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం, మరో దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మించారు. అరవింద్ స్వామి, బిజోరు నంబియార్, గౌతమ్ మీనన్, రతీంద్రన్ ఆర్. ప్రసాద్, సర్జున్ కె.ఎం, ప్రియదర్శన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్ వంటి 9 మంది దర్శకులు ఈ వెబ్సిరీస్ని 9 భాగాలుగా తెరకెక్కించారు. ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'నవరస' స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన టీజర్ అందర్నీ ఎంతగానో అలరిస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ వెబ్‌సిరీస్‌లో హాస్యం, శంగారం, కరుణ, శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, అద్భుతం, వీరం... ఇలా నవరసాలతో కూడిన ఒక్కో కథ, ఒక్కో భావోద్వేగం నేపథ్యంలో సాగటం విశేషం.