Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ ట్యూన్ చేసిన మాస్ సాంగ్ 'మందులోడా..ఓరి మాయాలోడా..' అంటూ సాగే పాటను చిరంజీవి విడుదల చేశారు. 'ఫుల్ మాస్ ట్యూన్స్ ఇవ్వడంలో మణిశర్మది ఓ ప్రత్యేకమైన శైలి. అందుకు తగ్గట్లుగానే లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ 'మందులోడా..' అంటూ సాగే మాస్ తీన్మార్ లిరిక్స్ అందించారు. దీంతో ఇప్పుడీ పాట అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పాట లిరికల్ వీడియోలో హీరో సుధీర్ బాబు వేసిన స్టెప్స్‌కి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ చిత్రాన్ని 'భలేమంచిరోజు', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' లాంటి బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాతలు విజరు చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి '1978 పలాస' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది.