Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. అయితే అతనితో బ్రేకప్ అయిపోయింది' అంటూ తన లవ్ బ్రేకప్ గురించి యువ కథానాయిక అనుపమా పరమేశ్వరన్ చెప్పింది. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమా తాజాగా ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అనుపమా నిర్మొహమాటంగా సమాధానమిచ్చింది. ఇందులో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా తన లవ్ ఫెయిల్యూర్ గురించి తెలిపింది. అలాగే హీరో రామ్ పోతినేని మంచి స్నేహితుడని, అమ్మ చేతి వంట అంటే ఎంతో ఇష్టమని, పాటలు పాడటం కూడా పాడతానని చెప్పింది. ఈ మధ్యకాలంలో పెయింటింగ్ కూడా నేర్చుకున్నానని, ఎప్పుడైనా ప్రశాంతత కావాలని భావించినప్పుడు వెంటనే పెయింటింగ్స్ వేస్తానని, దాంతో తన మనసు, హదయం రెండూ సంతోషంగా మారుతాయని అనుపమా తెలిపింది. అలాగే తన సినిమాల గురించి మాట్లాడుతూ, 'ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. '18 పేజెస్, 'కార్తికేయ -2', 'రౌడీ బార్సు' చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. తమిళంలో 'తల్లిపోగాదే'లో నటిస్తున్నాను. అయితే కన్నడ చిత్రపరిశ్రమను మిస్ అవుతున్నాను. మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే కన్నడలో కూడా చేస్తాను' అని అనుపమా చెప్పింది.