Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. 'నాగశౌర్య, జగపతిబాబుతోపాటు ఇతర నటీనటులు పాల్గొనగా ప్రేక్షకుల మనసుని గెలుచుకునే రీతిలో ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.