Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి టైటిల్ పాత్రధారిగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా ఆపిన యూనిట్, ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పునఃప్రారంభించారు. 'రీసెంట్గా 'ఆచార్య' ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణని స్టార్ట్ చేశారు. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని మేకర్స్ ఎనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, 'లాహే లాహే..' సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది' అని చిత్ర యూనిట్ తెలిపింది. చిరంజీవి, రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: సురేష్ సెల్వరాజ్, సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణ్ణావుక్కరసు, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాత: నిరంజన్ రెడ్డి, రచన, దర్శకత్వం: కొరటాల శివ.