Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ కథానాయకుడిగా లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఈనెల 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పవర్ పోలీస్ ఆఫీసర్‌గా రామ్ కనిపించనున్నట్టు సమాచారం. అలాగే ఈ చిత్రానికి 'ఉస్తాద్' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. రామ్ కెరీర్లోనే 'ఇస్మార్ట్ శంకర్' బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇందులో 'ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్..' అంటూ రామ్ డైలాగ్ చెప్పిన ప్రతీసారి ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో 'ఉస్తాద్' ఫర్ఫెక్ట్ టైటిల్‌గా చిత్ర బృందం భావిస్తోందని టాక్.