Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్‌హాసన్, డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం 'విక్రమ్'. శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్‌లుక్‌లో కమల్‌హాసన్, విజరు సేతుపతి, ఫహాద్ ఫాజిల్ గుబురు గడ్డంతో, రగ్డ్లుక్లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ముగ్గురు విలక్షణ నటులు.. డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కమల్ హసన్ నిర్మిస్తున్నారు. 'శౌర్యం మాత్రమే కిరీటాన్ని ధరించాలి. మా ప్రతిభలో ఉత్తమమైన వాటిని మీకు అందించడానికి నేను మళ్ళీ ధైర్యం చేస్తున్నాను. మునుపటిలాగే, మాకు విజయం ఇవ్వండి' అని కమల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.